15-07-2025 03:01:06 PM
చిలుకూరు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిలుకూరు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు(Senior leaders of the CPI party) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు కుటుంబాన్ని మంగళవారం. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్, రాంచందర్ రావు పరామర్శించి,ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పాటుపడిన మహా వ్యక్తి దొడ్డ నారాయణరావు అని, ఆయన తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు అని అన్నారు. ఆయన వెంట బిజెపి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్, సుగుణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొండ శ్రీను, కొల్లు నరసయ్య, సుదర్శన్, సాతులూరి గురవయ్య, ఆయన కుమారులు దొడ్డ రమేష్, దొడ్డ సురేష్ బాబు, దొడ్డ శ్రీధర్, ఉన్నారు.