calender_icon.png 15 July, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి అర్జీలను త్వరగా పరిష్కరించాలి

15-07-2025 12:00:00 AM

-కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అం దిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం  కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్,  ఆర్డీవో లోకేశ్వరరావు లతో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తులను క్షుణ్ణం గా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గ్రీవెన్స్ సెల్ ప్రారంభించడం జరిగిందని, ఇతర రోజులలో గ్రీవెన్స్ సెల్‌లో అర్జీ సమర్పించవచ్చని, నిర్ణీత గడువులోగా దరఖా స్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అధికా రులు, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.