07-05-2025 12:03:02 AM
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్ర్టం దివాళా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే పేర్కొనడం పకడ్బందీ వ్యూహంలా కనిపిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం, ప్రభుత్వాన్ని నడపటం చేతగాకపోతే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రా ష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు.
ఒకవైపు ఉద్యోగులను భయపెడుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరోవైపు ప్రజలలో భయం రేకెత్తించి సంక్షేమాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. బా ధ్యత గల సీఎంగా రే వంత్ రాష్ట్రాన్ని కాపాడాల్సింది పోయి ప్ర జల్ని ఉద్యోగస్తుల మీదకు ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రబీ, ఖరీఫ్ సమయంలో రైతు భరోసా నిధులు విడుదల చేయకుం డా, అదే డబ్బును బడా కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లించడం చూస్తే రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి సుస్పష్టమైందన్నారు. మహాలక్ష్మి పథకాన్ని విరమించుకునే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవన్నారు.