07-05-2025 12:01:14 AM
కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, మే 6 (విజయక్రాంతి): జిల్లా ప్రజలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూనా ప్రారంభ పనులకు నీధులు కేటాయించడం హర్షణీయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో రైతుల తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా జీవితకాలపు చిరకాల కోరిక ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం) 20,21,22 ప్యాకేజీ ద్వారా జిల్లాలో సాగు నీరు అందించేందుకు చివరి శ్వాస వరకు పోరాటం చేసైన దాన్ని పూర్తి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేయడం యావత్ రైతాంగం కళ్ళల్లో ఆనందం కలిగించే అంశమన్నారు.
జిల్లాకు చెందిన రైతులకు శాశ్వతంగా సాగు నీటి పరిష్కారం కోసం భూసేకరణ , తదితర బిల్లుల చెల్లింపు కోసం 23 కోట్ల రూపాయలు మంజూరు చేయించి రైతంగానికి తీపి కబురు అందించారన్నారు. ఎత్తిపోతల పథకం పై రైతుల ఆశలు చిగురిస్తున్నాయని జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని ఆ ఘనత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యుడు నిమ్మ మోహన్ రెడ్డి, మామిళ్ళ అంజయ్య, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.