09-01-2026 12:00:00 AM
మేడ్చల్, జనవరి 8 (విజయ క్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రూ.2.08 కోట్ల విలువచేసే 1039 సెల్ ఫోన్లు రికవరీ చేశామని డిసిపి (క్రైమ్స్) కే గుణశేఖర్ తెలిపారు. గురువారం నేరేడ్మెట్ లోని సిపి కార్యాలయంలో అదనపు డిసిపి (క్రైమ్స్) సిహెచ్ రామేశ్వర్, ఏసీపీ కరుణ సాగర్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజి స్ట్రీ (సిఈఐఆర్) పోర్టల్ సహాయంతో గుర్తించామని తెలిపారు.
పోలీస్ కమిషనర్ అవినా ష్ మహంతి ఆదేశాల మేరకు సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశామన్నా రు. సెల్ ఫోన్ లను రికవరీ చేయడానికి మల్కాజిగిరి, ఎల్బీనగర్ సిసిఎస్, ఐటి సెల్ సహా యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు 6 నెలల వ్యవధి లో 1039 సెల్ ఫోన్లు రికవరీ చేశాయని ఆయన వివరించారు. ఎల్బీనగర్ జోన్ లో 739, మల్కాజిగిరి జూన్ లో 300 రికవరీ చేశాయని అన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు 4733 మొబైల్ ఫోన్లు రికవరీ చేయ డం చెప్పుకోదగిన విషయం అన్నారు. ప్రజ లు తమ ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని, ఇవి దొంగలించబడితే దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందన్నారు. మొబైల్ ఫోన్లు అధికృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని ఆ యన సూచించారు. దొంగిలించబడిన ఫో న్లు కొనడం, విక్రయించడం నేరమని ఆయ న పేర్కొన్నారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.