17 April, 2026 | 12:55 PM

తప్పు చేస్తే ప్రధానైనా విచారణకు రావాలి

07-06-2025 01:40 AM
  1. ఎంపీ ఈటల రాజేందర్ ఎంత?
  2. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ విచార ణపై బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చారని బీజేపీ అధిష్ఠా నం అంటోంది.. తప్పు చేస్తే ప్రధాని మోదీ అయినా విచారణకు హాజరు కావాల్సిందే.. ఈటల రాజేందర్ ఓ లెక్కా అని ఎమ్మెల్యే వాపోయారు.  కేసీఆర్ కనుసన్నల్లోనే అంతా జరిగిందని ఆరోపించారు. 2018 మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్‌కు  రూ.1,400 కోట్లు వ చ్చాయని, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో భాగమనేన్నారు.