30-07-2024 01:43:56 AM
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించేవారికి మధ్య చాలా తేడా ఉంటుందని వైసీపీ చేసిన ట్వీట్‌కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమాధానం చెప్పారు. అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అంటే తాను చంద్రబాబుకు కొమ్ముకాసినట్టు ఉందా? అని మండిపడ్డా రు. ‘మీ మాటలు చూస్తే జగన్ మీద ధ్వేష మే కనిపిస్తోంది తప్ప.. ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు’ అని వైసీపీ చేసిన విమర్శలపైనా షర్మిల సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో తన ను కించపరిచేంత ధ్వేషం మీకు ఉంది..
మాకు ధ్వేషం లేదు. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తమకు ఉందని, అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా? అన్నది ముఖ్యం కాదన్నారు. జగ న్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నామన్నారు. వైఎస్సార్ విగ్రహా లు కూల్చేస్తే తానే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింనట్టు గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పు డు ఈ పరిస్థితి వచ్చేది కాదని హితవుపలికారు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపో యి ఉంటే ఈరోజు వైఎస్సార్‌కు ఇంత అవమానం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. వైసీపీ నుంచి వైఎస్సార్‌ను ఎప్పుడో వెళ్లగొట్టారని, ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే అని వివరించారు. పక్క రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నామని, మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారని, మద్యపాన నిషేధం అని దగా చేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబం ధం పెట్టుకున్నారని ఆరోపించారు.