calender_icon.png 12 November, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీటర్ల విషయంలో సభ తప్పుదోవ

30-07-2024 01:32:33 AM

  • సీఎం చెప్పేవి అబద్ధాలు 

ప్రభుత్వం తీరుపై కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): విద్యుత్తు మీటర్ల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పదోవ పట్టించారని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించా లని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి అడ్జెంట్‌మెంట్ నోటీసులిచ్చామని తెలిపారు. శనివారం శాసనస భలో బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా విద్యుత్తు మీటర్ల అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం సమాధానమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఈ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్ మీటర్లు బిగించకపోతే అగ్రిమెంట్‌ను ఉల్లఘించారని కేంద్ర ప్రభుత్వం డిస్కంలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అన్నా రు.

ప్రస్తుతం మెడ మీద కత్తి వేలాడుతున్నదని, గత ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పం దాలు రాష్ట్రానికి గుదిబండగా మారాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు శాఖకు విధిలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానమి వ్వడానికి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వకుండా నే సభ సోమవారానికి వాయిదా పడింది. నేపథ్యంలో ఈ అంశంపై సభలో చర్చించాలని కోరుతూ కేటీఆర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. 

పేదలకు ముఖేశ్‌గౌడ్ ఎంతో సేవ చేశారు: కేటీఆర్ 

ముఖేశ్‌గౌడ్ గ్రేటర్ హైదరాబాద్‌లో పేదలకు ఎంతో సేవ చేశారని, ఆయన నేటి రాజకీయ నాయకులను ఆదర్శంగా నిలిచారని కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన ముఖేశ్‌గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో  మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.