టీజీవో ఆధ్వర్యంలో ఇఫ్తార్
10-03-2026 02:22 AM
నాంపల్లిలోని సంఘ భవన్‌లో నిర్వహణ
హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): టీజీవో కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు వేడుకలను నాంపల్లిలోని టీజీవో భవన్‌లో సోమవారం నిర్వహించారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బీ.శ్యామ్ మాట్లాడుతూ రంజాన్ మాసం కేవలం ఆహార పానీయాలను వదిలేయడం మాత్రమే కాదు...ఇది ఆత్మశుద్ధికి, క్రమశిక్షణకు ఒక గొప్ప మార్గమన్నారు.
త్యాగం, క్రమశిక్షణకు ప్రతీక అయిన ఈ రంజాన్ మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీజీవో నాయకులు ఖాదర్, శౌకత్ హుస్సేన్, అత్తర్ పర్వేజ్, లూత్ఫ్ అలీ, షబానా, అబ్దుల్లా, చావా రవి, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




