04-09-2025 12:40:51 AM
- ఆరు గ్యారెంటీలతోపాటు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా
- సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబరు 3, (విజయ క్రాంతి):రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చం డ్రుగొండ బెండలపాడు పర్యటన ఉన్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సిపిఎం నాయకు లను తెల్లవారుజామున నుండి ఇళ్లకు వెళ్లి అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎం జి ల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఖండించారు. ఈ సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు అన్నవరపు సత్యనారాయణ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఏ న బీ భూక్య రమేష్ పిట్టల అర్జున్ నాయకులు జంగిలి వెంకటరత్నం పెద్దిని వేణు సత్య సు ల్తానా మరియు ఇతర కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలిపారు.
ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనను సిపి ఎం స్వాగతించిందని అలాగే జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పర్యటన ఉపయోగపడాలని కూడా సిపిఎం భావించిందని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి ని కలిసి ముఖ్యమైన ప్రజా సమస్యలు వివరించడానికి అధికారులు అనుమతి కూడా అడిగిన నిరాకరించారని ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని అన్నారు. నిత్యం ప్రజా స్వామ్యం గురించి కమ్యూనిస్టుల పోరాటాల గురించి గొప్పగా మాట్లాడే ముఖ్యమంత్రి గారు తన పర్యటన సందర్భంగా సిపిఎం నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని, ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆ యన ప్రశ్నించారు.
జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ప్రజల సమస్యలు తెలియజేసే హక్కు ప్రతిపక్షాలకు ప్రత్యేకించి పోరా టాలు చేసే వామపక్ష పార్టీలకు ఉంటుందని ఆ హక్కుని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రులు మంత్రుల పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేసి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే అవకా శం ఇతర రాజకీయ పార్టీలకు కల్పించాలని అదే నిజమైన ప్రజాస్వామ్యమని అన్నారు. కానీ నిత్యం ప్రజాస్వామ్యం జపం చేస్తున్న ముఖ్యమంత్రి గారు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. సిపిఎం నాయకులతోపాటు ఎస్‌ఎఫ్‌ఐ సిఐటియు రైతు సంఘం ఇతర ప్రజాసంఘాల నాయకుల అరెస్టులను ఖండించారు. అరెస్టు చేసిన సిపిఎం నాయకులు మరియు ప్రజా సం ఘాల నాయకులను బే షరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.