05-09-2025 11:33:20 AM
హుజురాబాద్,(విజయక్రాంతి): రోజు రోజుకి రైతులకియూరియా కష్టాలు తీవ్రమవుతున్నాయి. గత రెండు వారాలుగా యూరియా రాకపోవడంతో పండుగ రోజు కరీంనగర్ జిల్లా(Karimnagar district) హుజురాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద శుక్రవారం రైతులు, మహిళా రైతులు తెల్లవారుజామున బారులు తీరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వేసిన పంటలు చేతికందుతాయో లేవోనని రైతులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సరిపడా పంపిణీ చేయలేదని చివరి దశలో ఎరువులు వేసే టైం వచ్చినప్పటికీ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లైన్లో నిల్చుకోలేక ఇబ్బంది పడిన ఓ రైతు క్యూ లైన్ లో చాప వేసుకుని కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అధికారులు చొరవ తీసుకొని రైతులకు సరిపడా ఎరువులు అందచేయకపోతే రైతులు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ చేసిన యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.