04-09-2025 12:41:52 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాల టౌన్ సెప్టెంబర్ 3 : మీ సవాల్ కు మేము సిద్ధంగా ఉన్నామని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు.అన్నారు. గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడిన ప్రతి మాటకు మేము సమాధానము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని గడిచిన 7 ఏళ్ల పాలనలో గ్రామ పంచాయతీలకు,మున్సిపాలిటీకి రాష్ట్ర నిధులు ఎంత?కేంద్ర నిధులు ఎంత? స్పష్టంగా ప్రజల ముం దుంచాలన్నారు.
ఎమ్మెల్యే చెప్తున్న అభివృద్ధి గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు 3 సార్లు శంకుస్థాపనలు,3 సార్లు ప్రాజెక్టు డిజైన్ లు చేసి ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదన్నారు ..ఈ సమా వేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రవికుమార్ ఎక్బోటే ,శ్యామ్ రావు,పట్టణ అధ్యక్షురాలు రజక జయ శ్రీ నర్సింలు,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాసు,మాజీ ఐటీసెల్ కన్వీనర్ చిత్తారి కిరణ్,ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్,నాయకులు తదితరులు ఉన్నారు.