calender_icon.png 5 September, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల బీభత్సం.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

05-09-2025 11:30:39 AM

హుజురాబాద్,(విజయక్రాంతి):  రోజు రోజుకి కోతుల బెడద ఎక్కువవుతుంది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని(Huzurabad town) పోచమ్మ కాలనీలో శుక్రవారం కోతుల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోచమ్మ వాడకు చెందిన తాళ్లపల్లి  సారయ్య ఇంటి వెనకాలో పని నిమిత్తం రాగా వెనకాలే ఉన్న కోతుల గుంపు ఒకసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గతంలో కూడా ఇలాంటి దాడులు అనేకసార్లు జరిగాయని, చాలామంది గాయాలపాలైనారు. ఈ మధ్యనే ఉపేందర్ అనే వృద్దుని వానరాలు గాయపరచగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రతినిత్యం వానరాల బాధతో భయపడుకుంటూ జీవించాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మున్సిపల్ సిబ్బంది ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.