27 February, 2026 | 12:27 PM

ఎమ్మెల్యే లక్ష్మిపై అక్రమ కేసును ఎత్తివేయాలి

25-02-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకురాలు మర్సకోల సరస్వతి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మున్సిపల్ చైర్మన్ మెంబెర్ ఆకాష్, నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు  బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీపై తప్పుడు కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆదివాసీ బిడ్డపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అహ్మద్, కౌన్సిలర్లు చిలువేరు వెంకన్న, కుర్సుంగే బాలకృష్ణ,  సాలం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్,అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు హివ్రే సందీప్, నాయకులు హైమద్, సాయి శ్రావణ్, తుకారాం, బలరామ్, భీమేష్, హివ్రే ప్రవీణ్, సంతోష్, మల్లేష్, ఆశన్న, రవీందర్, పొన్నాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.