అక్రమంగా మద్యం విక్రయాలు
- గ్రామాలలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
- అనుమతులు లేకుండానే దర్జాగా దందా
- పట్టించుకోని అధికారులు
కామారెడ్డి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి కారణంగా గ్రామాలలో విచ్చల విడిగా బెల్టు షాపుల నిర్వహణ కొనసాగుతుంది. గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్న సదరు అధికారులు తమకు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సదరు బెల్ట్ షాపుల వ్యాపారులు అందించే మామూళ్లకు తలొగ్గుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
అడిగేవారు ఎవరన్నా ధీమాతో సదరు వ్యాపారులు దందాను కొనసాగిస్తున్నారు. దీంతో వారు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే అనుమతులు ఉన్నట్లు వ్యాపారులు మూడు పువ్వులు ముప్పయి ఆరు కాయలుగా దందాను సాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ, బిబిపేట బిక్కనూరు మండలంలో అక్రమ బెల్టు షాపుల దందా ధర్జాగా కొనసాగుతుంది.
అక్రమ బెల్టు షాపులను నియంత్రించాల్సిన సదరు ఎక్సైజ్ శాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే ముడుపులకు తలోగ్గడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామాలలో బెల్టు షాపు లు ధర్జాగా కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపులలో వైన్స్షాపులను మరిపించే విధంగా మధ్యాన్ని విక్రయిస్తున్నారు.దీంతో యువకులు ఉదయం నుంచే మద్యం మత్తులో ఊగిపోతున్నారు. మద్యం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ మద్యాన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలు అయ్యిందంటే చాలు ఎక్కడబడితే అక్కడ గ్రామాల్లో సిట్టింగులు కొనసాగుతున్నాయి.మద్యం మత్తులో ప్రయాణికులకు అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గ్రామాలలో రహదారి పనులు నత్తనడకన ప్రధాన రహదారి పనులు జరగడం వల్ల వాహనదారులకు మరింత ప్రమాదాలు సంభవిస్తున్నాయి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని.
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మద్యం విక్రయాలు..
ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో రోడ్డు పక్కనే దర్జాగా బెల్టు షాపులు తెరిచి మధ్య విక్రయాలు సాగిస్తున్నారు. రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి ,అయినా సదరు బాధ్యత గల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ధీంతో తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. నెలనెలా సదరు వ్యాపారుల నుంచి అందుతున్న మామూళ్ల కు అలవాటు పడ్డ అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవగారిస్తున్నారు. ధీంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.




