calender_icon.png 13 October, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపం కాంగ్రెస్‌దే..

13-10-2025 01:38:39 AM

బీసీ రిజర్వేషన్ల సాధనకు హైకోర్టులో విఫలమై.. ఇప్పుడు డ్రామాలు

-సర్కార్ అసమర్థతే బడుగులకు శాపం 

-సుప్రీంకోర్టు తీర్పును రాష్ర్టపతి కూడా మార్చలేరు

-రాష్ర్ట ప్రభుత్వ అప్పీలును స్వాగతిస్తున్నాం 

-జూబ్లీహిల్స్ అభ్యర్థిపై త్వరలో అధిష్ఠానం ప్రకటన

-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 12 (విజయక్రాంతి ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోవడానికి కాంగ్రెస్‌దే పాప మని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ర్ట ప్రభు త్వ అసమర్థత, చేతకానితనంతో హైకోర్టులో బలమైన వాదనలు వినిపించ డంలో ఘోరంగా విఫలమై, ఇప్పుడు బీసీల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.   

వైఫల్యాలు పునరావృతం..

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని లోతుగా విశ్లేషిస్తూ కిషన్ రెడ్డి చారిత్రక తప్పిదాలను గుర్తుచేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టులో పరిమితి పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనని తెలిపారు. అప్పుడు ఆ పరిమితికి వ్యతిరేకంగా సరైన వాదన లు వినిపించడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చాక, హైకోర్టులో కూడా అదే వైఫల్యాన్ని పునరావృతం చేశారని విమ ర్శించారు.

బలహీనమైన వాదనలతో కోర్టులో చేతులెత్తేసి, ఇప్పుడు బీసీల భవిష్యత్‌ను ప్రమాదంలో పడేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, దానిని మార్చే అధికారం ఎవరికీ ఉండదు. కేంద్ర మంత్రి , చివరికి రాష్ర్టపతి కూడా ఏమీ చేయలేరు. దీనికి మహారాష్ట్రే ఒక ఉదాహరణ. అక్కడ మా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మేమేమీ చేయలేకపోయాం, అని ఆయన వాస్తవ పరిస్థితిని వివరించారు.

బీజేపీ మద్దతు బీసీలకే..

బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమ పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైకోర్టు తీర్పుపై రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. బీసీల న్యాయమైన హక్కుల కోసం చేసే ఏ పోరాటానికైనా బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుంది, అని ఆయన స్పష్టం చేశారు.అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఆయన స్పందించారు.

జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ముగ్గురు ఆశావహుల పేర్లను రాష్ర్ట కమిటీ పరిశీలించి, తుది నిర్ణయం కోసం జాతీయ పార్లమెంటరీ బోర్డుకు పంపించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే అధిష్ఠానం సమావేశమై, అన్ని కోణాల్లో చర్చించి, బలమైన అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తుంది, అని తెలిపారు.