టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా కొత్త శ్రీను ఎన్నిక
అడ్డాకుల: టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ మండల అధ్యక్షునిగ సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడి దగ్గర టిఆర్ఎస్ పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ గడోళ్ళ దామోదర్ గౌడ్ చేతుల మీదగా మండల పార్టీ అధ్యక్షునిగా కదురు గ్రామానికి చెందిన కొత్త శ్రీనుకు నియమంక పత్రం అందజేశారు. దామోదర్ గౌడ్ మాట్లాడుతూ... రక్షణ సేన అధ్యక్షురాలు కవితక్క ఆదేశాల మేరకు నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తున్న వారికి పార్టీ పదవులు వస్తాయి, బడుగు బలహీనవర్గాలకు పేద ప్రజలకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మా ప్రభుత్వమే అన్నారు.
కొత్త సినిమా మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పార్టీ నన్ను మండల అధ్యక్షునిగా కేటాయించినందుకు తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత, నియోజకవర్గ ఇంచార్జ్ దామోదర్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా నాయకులు కరాటే శీను సాగర్, నాగేశ్వరరావు మన్నెంకొండ తిరుపతయ్య కృష్ణయ్య రవీందర్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






