3 July, 2026 | 11:14 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

అక్రమంగా కేటాయించిన షటర్లను రద్దు చేయాలి

14-06-2025 12:00 AM

కమిషనర్ శ్రీనివాస్‌రావుకి వినతి

బెల్లంపల్లి అర్బన్, జూన్ 13 : బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ దుకాణాలను అక్రమంగా అనర్హులకు కేటాయించిన అధికారుల చర్య పై ఆందోళన చేశారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అర్హులకు కేటాయించాల్సిన షటర్లను అక్రమంగా అనర్హులై న ఐదుగురికి కేటాయించారని ఆందోళనకారులు ఆరోపించారు. షటర్లను లాటరీ పద్దతి ద్వారా 25 మందికి కెటాయిస్తామన్నారు.

కాని కొంత మంది లాలుచి పడి డబ్బులకు అమ్ముడుపోయి లాటరీ తీసే సమయములో అప్పటికప్పుడు కొంతమంది పేర్లు ఉన్న చీటీలను కమీషనర్‌కి ఇచ్చి ఆ చిట్టిలో ఉన్న పేర్లనే ప్రకటించారనీ ఆరోపించారు. ఈ వ్యవహారమంత జిల్లా కలెక్టర్ కలెక్టర్, బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల సమక్షములోనే జరిగినదనీ తెలిపారు. అందరు చూ స్తుండగానే నిజమైన లబ్దిదారులకు అన్యా యo చేశారని మండిపడ్డారు.

బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ నూతన షెటర్లు లాటరీ ద్వారా కేటాయింపు విషయంలో లాటరీ తీసే సమయంలో వెనక వైపు నుంచి దొంగ చిటీలు కూరగాయల వ్యాపారానికి  సంభంధం లేని వారి పేర్లు డ్రా పద్ధతి ద్వారా అక్రమంగా షాప్స్ కేటాయించినతీరు ,చిటి అందించే సాక్షాలు, ఫోటో, విడియోలు మా దగ్గర నిరూపించడానికి  ఉన్నాయనీ తెలిపారు.

షటర్ల కేటాయింపు విషయంలో అవకతవకలకు పాలుపడిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా కేటాయించిన వారి పేర్లను తొలగిం ది నిజమైన లబ్దిదారులకు కెటాయించాలని లేని పక్షoలో అన్యాయం జరిగిన నిజమైన లబ్దిదారులు వ్యాపారస్తులను, ప్రజలను కలపుకొని, బెల్లంపల్లిలో పెద్దఎత్తున ఆందోలన, నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు.

అక్రమంగా కేటాయించిన 10,19,16,21.87 ఈ నంబర్ల గల షటర్ల ను అర్హులైన వ్యాపారస్తులకు కేటాయించాలన్నారు. ఈ కార్యక్ర మంలో  బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండి అఫ్జల్, ఆనంద్ సుదర్శన్, ఖలీల్ బేగ్, అన్వర్ ఖాన్, శ్రీనివాస్, జలీల్ పాల్గొన్నారు.