సోమారం స్కూల్‌కు ప్రొజెక్టర్, స్క్రీన్ విరాళం
17-08-2026 12:24 AM
తాడ్వాయి, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం పాఠశాలకు హైదరాబాద్ కు చెందిన సాంకేత్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రొజెక్టర్, స్క్రీన్ విరాళంగా అందించారు. గ్రామానికి చెందిన కామిశెట్టి సంతోష్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సంప్రదించగా వారు రూ.53 వేల విలువైన ప్రొజెక్టర్, స్క్రీన్‌ను విరాళంగా అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. పాఠశాలకే కాకుండా అంగ న్వాడి సెంటర్‌కు ఫ్యాన్లు, విద్యసామగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో సాంకేత్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మురళి పని కుమార్, మమత, సర్పంచ్ వినోద, కాట్రోత్ రమేష్, హెచ్‌ఎం రవికాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






