15 April, 2026 | 8:48 AM

కవితలో ఇంత ఆవేదన ఇప్పుడే చూస్తున్నా

30-05-2025 02:02 AM

మాజీ ఎంపీ వినోద్‌కుమార్

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): తమ పార్టీ ఎమ్మెల్సీ కవితలో ఇంత ఆవేదనను ఇప్పుడే చూస్తున్నానని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడే అంశాలపై షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తామని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమేనని, చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చాలా చూశామని చెప్పారు. తమ పార్టీ మొదటిది కాదు.. చివరిది కాదని పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో కరుణానిధి, అళగిరి, కనిమొలి ఫ్యామిలీ రాజకీయాలు చూశామని గుర్తుచేశారు. తమ పార్టీ టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి పని చేసిందన్నారు. ఒక్క బీజేపీతోనే తాము పనిచేయలేదని వెల్లడించారు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునే వాళ్లమని చెప్పారు. కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తానని తెలిపారు.