30-06-2024 12:19:58 AM
హైదరాబాద్,జూన్ 29 (విజయక్రాంతి): ఉత్తర ఒడిశా తీర సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడినట్టు, దీని ప్రభావం తెలంగాణపై అంతగా లేకపోయినా.. నేటి నుంచి బుధవారం వరకు బలమైన, స్థిరమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, క్తొగూడెం, ఖమ్మం,మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.