03-12-2025 10:51:46 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూరు మండలంలో రంగయ్య అనారోగ్యంతో మృతిచెందడంతో అతని భార్యకు మంజూరైన భీమా చెక్కును అందజేశారు. మోగవెల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బిపిఎం రాచకొండ చంద్రశేఖర్ వద్ద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా PMJJBY పాలసీ చేసుకోవడం తీసుకున్నారు. ఇందుకుగాను నామిని అయినా తారాబాయి(మృతుని భార్య)కి రెండు లక్షల రూపాయల చెక్కుని ఆదిలాబాద్ సూపరిండెంట్ గుంప స్వామి బుధవారం కాగజ్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో అందించడం జరిగింది. సూపర్డెంట్ మాట్లాడుతూ PMJJBY పాలసీ ఇతర పోస్టల్ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్, ఐపిపిబి సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.