20 April, 2026 | 7:43 PM

మెట్లకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు చేయాలి

20-04-2026 06:17 PM

వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్

దేవరకొండ,(విజయక్రాంతి): మెట్లకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి ఉపాధి హామీ చట్టం పటిష్టంగా అమలు చేయాలి. అని వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు. సోమవారం పీఏ పల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్  మాట్లాడుతూ ఆన్లైన్ పేమెంట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకొని కొత్త చట్టం ద్వారా కూలీలను పనికి దూరం చేయటానికి రెండు సార్లు ఫోటోలు అప్లోడ్ విధానం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ పటిష్టంగా అమలు జరగాలంటే మెట్ల వస్తున్న తీసుకొని ప్రతి  సంవత్సరం ట్రైనింగ్ క్యాంపు నిర్వహించి మేట్లకు పారితోషకం ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ పర్మినెంట్ చేయాలని పేదల సాగు భూముల అభివృద్ధికి పనులు చేపట్టి కేంద్ర బడ్జెట్లో కనీసం రూ 2'64 లక్షల కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి కావలి కృష్ణయ్య పావురాల గట్టు వార్డ్ మెంబర్ మోతిలాల్ ఎం వెంకటేశ్వర్లు సాయిలు ఆర్ చందు రమేష్ తదితరులు పాల్గొన్నారు.