calender_icon.png 6 September, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న భవాని నగర్ వినాయకుని శోభాయాత్ర..

03-09-2025 03:52:24 PM

అమ్మవార్ల వేషధారణలు నృత్యాలు..

ఉప్పల్ (విజయక్రాంతి): మల్లాపూర్ డివిజన్(Mallapur Division)లోని భవాని నగర్ లో ఏర్పాటుచేసిన లండన్ భరత్ వినాయక శోభయాత్ర కాలనీ వాసులతో పాటు పలువురుని ఆకట్టుకుంది. ప్రతి ఏటా ఇలాగే ఈ సంవత్సరం కూడా  కన్నుల పండుగ  శోభాయాత్రను  భరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ డివిజన్లోని వినూత్న రీతిలో వినాయకుని శోభయాత్రను నిర్వహించారు. అమ్మవారి వేషధారాలలో ప్రత్యేక బ్యాండ్ వినాయకుని నిమర్జనానికి తరలి వెళ్లారు. కాలనీవాసులు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఉత్సవాలలో పాల్గొని నృత్యాలు చేశారు. దీనికి రాజకీయ నాయకులతో పాటు పలు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. హాజరైన నాయకులకు భరత్ శాలలతో సన్మానించారు. నిమర్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులకు భరత్ సహకరించారు. అనంతరం చర్లపల్లిలోని నిమర్జనంకి తరలించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ యూత్ నాయకులు శ్రావణ్ గౌడ్ భాను గౌడ్ అడ్వకేట్ రవి మనీష్ చిన్న గౌడ్ చిరంజీవి రావు చింటూ  పాల్గొన్నారు.