calender_icon.png 5 September, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ కు మానుకోట పిసి అంజయ్య ఎంపిక

03-09-2025 03:16:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహారాష్ట్రలోని పూణేలో అక్టోబర్ నెలలో జరిగే 69వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్(All India Police Duty Meet)కు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కానిస్టేబుల్ అంజయ్య అసిస్టెంట్ కోచ్ గా ఎంపికయ్యారు. అంజయ్య గతంలో 61, 68వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో సిల్వర్, కాంస్య పథకాలను సాధించారు. ఈ క్రమంలో పూణేలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్ లో పాల్గొనే మొయినాబాద్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన వారికి రూమ్ సర్చ్, వెహికల్ సెర్చ్, గ్రౌండ్ సెర్చ్, యాక్సిస్ కంట్రోల్ తదితర అంశాలపై చీఫ్ కోచ్ ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో అంజయ్య అసిస్టెంట్ పోజుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ అంజయ్య అభినందించారు.