30 June, 2026 | 1:43 AM

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనది

30-06-2026 12:00 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ రోడ్డు నెంబరు 3లోని ఓ అపార్ట్మెంటులో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. బీఎల్‌ఓ బాలాజీ, బీఎల్‌ఏ శోభారాణితో కలిసి ప్రక్రియను పరిశీలించారు. వారితో కలిసి నివాసితులకు ఎన్యుమరేషన్ ఫారంలను అందజేశారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరి ఓటును కాపాడేందుకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అనర్హుల ఓట్లు తొలగించడం ఎంత ముఖ్యమో, అర్హుల ఓట్లను కాపాడడం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎన్యుమరేషన్ ఫారం నింపడంలో కూడా ఓటర్లకు సహకరిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్ ను కలిసి ఎన్యుమరేషన్ ఫారం అందజేశారు. గోవర్ధన్ రెడ్డి వెంట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.