calender_icon.png 14 May, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో.. స్మార్ట్‌గా!

11-05-2025 12:13:26 AM

ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించాయి ఇండో వెస్ట్రన్ కాంబినేషన్‌లో వస్తున్న కాటన్ ఫ్రాక్స్. ఎండాకాలం చల్లదనం, సౌకర్యం కావాలనుకునే వారికి తొలి ఎంపిక కాటన్ దుస్తులే. సుతిమెత్తగా, గాలి ఆడుతూ ఉండటంతో ఇవి మహిళల ఫేవరెట్‌గా మారిపోయాయి. ఈ వేసవి రుతువుల్ని ఆనందమయం చేసుకోవాలంటే.. మెత్తగా.. లేతరంగుల్లో ఉండే లాంగ్ ఫ్రాక్స్‌ను ట్రై చేయండి..

ప్రకృతి రంగులు అద్దుతూ.. ఫ్యాషన్ డిజైనర్లు ఫ్లోరల్ ఫ్రింట్ల దుస్తుల్ని డిజైన్ చేశారు. అలసిన కళ్లని సేదతీర్చే పూల సొగసులతో ఈ చల్లచల్లటి ట్రెండ్‌ని సృష్టించేశారు. అలా మొదట్లో తెలుపు, లేలేత రంగుల మీద ముదురు రంగు పువ్వుల ప్రింట్లతో కొన్ని రకాల దుస్తుల్ని మాత్రమే తయారుచేసేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. ఒకవైపు సంప్రదాయ దుస్తుల్లో, మరోవైపు ట్రెండీ డ్రెస్సుల్లో ఇదే సింగిల్ ఫ్యాషన్ అయిపోయింది. కాటన్, షిఫాన్, జార్జెట్, సిల్క్, నెట్, ఆర్గంజా.. ఇలా ఒకటేంటీ అన్ని రకాల ఫ్యాబ్రిక్కుల మీదకి ఈ ఫ్లోరల్ ఫ్రింట్ల అందం వచ్చేసింది. 

ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చే ఎన్నెన్నో డిజైన్లకు రూపమిస్తున్నారు డిజైనర్లు. కొన్నేమో పైనుంచి కింద వరకూ చిట్టిచిట్టి పూల ప్రింట్లతో ఆకర్షిస్తే.. మరికొన్ని పువ్వుల అంచులతో అద్భుతం అనిపిస్తున్నాయి. ఇంకొన్ని లేత రంగుల మధ్యలో చక్కటి ఫ్లవర్లతో అదిరిపోతున్నాయి. అక్కడక్కడ మాత్రమే కనిపించే ఫ్లవర్ డిజైన్ల డ్రెస్సులూ ఉన్నాయి.