జేబీఎస్‌లో చలివేంద్రం ప్రారంభం
25-04-2024 02:09 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : శ్రీసత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జూబ్లీ బస్‌స్టేషన్(జేబీఎస్)లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రయాణీకులకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని బస్‌స్టేషన్లలో చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చా రు. చలివేంద్రం ఏర్పాటు చేసిన సత్యసాయి సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి డిప్యూటీ ఆర్‌ఎ మ్ రాజు, సత్యసాయి సభ్యులు పాల్గొన్నారు.






