పాలమూరు సీఎంకు ప్రత్యేకం
25-04-2024 02:08 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఒకవైపు రాష్ట్రంతో పాటు, పక్క రాష్ట్రాల్లోనూ ఎన్నికల పర్యటనలు చేస్తున్నారు. అయితే, పాలమూరు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొండగల్ అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్‌ఫైట్ ఉందని సర్వే నివేదికలు స్పష్టం చేస్తుండటంతో.. సొంత జిల్లాలో సీటు చేజారొద్దనే పట్టుదలో ఉన్నారు. అందుకే కొడంగల్‌లో ఇప్పటికే మూడుసార్లు పర్యటించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో రెండుసార్లు బహిరంగ సభలను కూడా నిర్వహించారు.






