సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వైభవంగా పూజలు
ముషీరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ మానసిక ప్రశాంతత పొందాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎం. నాగేష్ ముదిరాజ్, ఎమ్మెన్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. బుధవారం ముషీరాబాద్ రామ్ నగర్ లోని శ్రీ వీరాట్ పోతులూరి వీక బ్రహ్మేంద్రసామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నాదాన కార్యక్రమాన్ని అతిథులు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, నాగేష్ ముదిరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బ్రహ్మం, కోశాధికారి అనంతచారి, కమిటీ నాయకులు అశోకాచారి, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.






