19-08-2025 01:48:27 PM
స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
బస్సు బేరింగ్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
కామారెడ్డి జిల్లా సీతాయిపల్లి శివారులో ఘటన
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో ఆర్టీసీ బస్సు బేరింగ్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ డిపో నుంచి కామారెడ్డి డిపోకు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సితాయిపల్లి గ్రామ శివారులోకి రాగానే బస్సు బేరింగ్ ఫెయిల్ అయి పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు బస్సు డ్రైవర్ కలిసి బస్సును పొలాల నుంచి రోడ్డుపైకి తెచ్చి పెట్టారు. బస్సు బేరింగ్ ఫెయిల్ కావడం వల్లే తృటీలో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్లె ప్రమాదం తప్పినట్లు తెలిపారు.