07-10-2025 12:00:00 AM
చిట్యాల, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరుమర్తి లింగయ్య సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో సోమవారం చేరారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. నార్కట్ పల్లి లోని ఆయన నివాసంలో వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారు మొగిలి వెంకన్న ,మొగిలి రావు, మునుపాటి వెంకన్న ,నిమ్మల గురువయ్య ,మేడి నాగరాజు, మొగిలి నాగయ్య ,బండమది మదర్, మేడ చంద్రయ్య ,బండమది ఆంజనేయులు, మేడి నాగరాజు, మేడ వెంకన్న చేరారు.