calender_icon.png 7 October, 2025 | 11:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద బీజేపీని ఓడించాలి

07-10-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని ఓడించేందుకు లౌకిక పార్టీలతో అవగాహన చేసుకుని ముందుకు వెళ్తామన్నారు.

కలిసి రాకపోతే వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుతామన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ బలమైన ప్రాంతాలలో సొంతంగానే పోటీ చేస్తామన్నారు.జిల్లాలో 9 జడ్పిటిసి, 56 సర్పంచ్, 59 ఎంపీటీసీ స్థానాల్లో బరిలో బరిలో దిగుతామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.