07-10-2025 12:00:00 AM
-రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మనిసాయి
వేములవాడ టౌన్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మనిసాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. వేములవాడ రూరల్ మండలం నమలిగుండుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగపల్లి మల్లేశం దంపతుల కుమారుడు వంగపల్లి మనిసాయి వర్మ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. నేషనల్ సర్వీస్ స్కీం స్వచ్ఛంద సంస్థలో చేరి సమాజసేవకు కృషి చేస్తున్నాడు. అందుకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అవార్డు ను అందుకున్నారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.