calender_icon.png 16 July, 2025 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏసీఎస్ వాజేడుకు రూ. 3.16 లక్షల చెక్ అందజేత

16-07-2025 12:00:00 AM

వాజేడు, జూలై 15, (విజయ క్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వాజేడు కు టెక్సాబ్ చైర్మన్ మర్నేని రవీందర్రావు మంగళవారం పిఎసిఎస్ వాజేడు అధ్యక్షులు ఎక్కడి అంజయ్యకు మూడు లక్షల పదహారు వేల రూపాయల చెక్కును అందజేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్ పి ఓ) కు వాజేడు పిఎసిఎస్ ఎంపికైంది.

రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఆర్థికపరంగా బలోపేతం చేయడానికి, వ్యాపార అభివృద్ధి క్రెడిట్ యోగిత పెంచడానికి రూపొందించబడినది. కాగా ఈ కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నందు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వాజేడుకు మూడు నెలలకు గాను నిర్వహణ, స్టేషనరీ ఖర్చుల కొరకు నగదు చెక్కును అందించినట్లు తెలిపారు.