3 July, 2026 | 8:55 PM

Breaking News

ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •  

రవాణా రెవెన్యూ పెంచండి

12-06-2024 12:28 AM

ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతిని సహించం

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కొద్దు

చెక్ పోస్టుల్లో నిఘా ఉంచాలి

సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి

రవాణ శాఖ అధికారులతో మంత్రి పొన్నం 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టానికి లోబడి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రవాణ శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంగళవారం ఆయ న సమీక్ష నిర్వహించారు.

త్రైమాసిక పన్ను వసూలుకు సంబంధించి తక్కువ ఆదాయాన్ని నమోదు చేసిన వివిధ జిల్లాల అధి కారులు పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. 100 శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. సమావేశానికి రాని అధికారులపె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆదా య అన్వేషణలో ప్రజలను వేధించకూడదని స్పష్టంచేశారు. చట్ట ప్రకారమే పనిచేయాలని ఆదేశించారు.  

ఫిట్‌నెస్ ఉంటేనే బస్సులు రోడ్లపైకి రావాలి

రోడ్డు భద్రతపై అన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పి ంచాలని మంత్రి ఆదేశించారు. బస్సులకు ఫిట్‌నెస్ ఉంటేనే రోడ్డుపై అనుమతిం చాల ని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కండిషన్ లేని బస్సులకు ఎట్టి పరిస్థితుల్లో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని, ఎవరైనా అందుకు మినహాయింపు అనుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతపై రవాణా శాఖ అధికారులు జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచిం చారు.  

చెక్ పోస్టుల్లో అవినీతి చరమగీతం

రాష్ర్ట సరిహద్దుల వద్ద ఉన్నచెక్ పోస్టుల్లో అవినీతి పెరిగిపోయిందని, దానిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలను పెంచి అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు. కేంద్రం ఆదేశాల మేరకు చెక్ పోస్టులను తొలగించే అం శంపైనా సమీక్షలో చర్చించారు. జప్తుచేసిన వాహనాలకు విషయంలో చట్టప్రకారం చర్య లు తీసుకోవాలని, వాటిని భద్రపరిచే ప్రదేశాల విషయంలో జిల్లా పోలీస్ అధికారు లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో ఆటో రిక్షాలపై ప్రస్తు తం ఉన్న పాలసీతో పాటు.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ జారీ, తదితర అంశాల్లో ఆర్టీఏ కార్యా లయాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. సమావేశంలో రవాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ట్ కమిషనర్లు ప్రవీణ్ రావు, రమేష్, మమత పాల్గొన్నారు.