2 July, 2026 | 6:45 AM

కొడంగల్ అభివృద్ధిలో వేగం పెంచాలి

12-06-2024 02:06 AM

వికారాబాద్, జూన్11 (విజయక్రాంతి) : కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్పరెన్స్ హాలులో నియోజకవర్గ అభివృద్దిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొడంగల్‌లో మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.  ఆస్పత్రికి వాటర్ ప్లాంట్, రెండు అంబులెన్స్‌లు, జనరేటర్‌తో పాటు అవసరమైన సిబ్బంది కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సింగిల్, డబుల్ రోడ్లతో పాటు జీపీ భవనాలు, కమ్యూనిటి హాల్స్, వంతెనలు అతిథి గృహాలకు సంబంధించిన పనులు మొదలు పెట్టాలని సూచించారు.