2 July, 2026 | 7:54 AM

మాన్‌సూన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

12-06-2024 02:04 AM

పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి

మేడిపల్లి, జూన్ 11: వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకొని మాన్ సూన్ బృందాలు అప్రమత్తంగా ఉం డాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ త్రిళేశ్వర్‌రావు, మున్సిపల్ అధి కారులు, వార్డు ఆఫీసర్లతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహిం చారు. అధికారులు  సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉం డాలని సూచించారు.

వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుం డా మూడు షిఫ్టుల్లో పనిచేసేం దుకు 3 మా న్‌సూన్ ఎమర్జెన్సీ బృం దాలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి సూచిక బో ర్డులు, ఓపెన్ నాలాల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కల్వర్టులు, డ్రైనేజీలు, కాల్వల్లో పూడికలు తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్వో శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జ్యోతి, ఏఈ బిక్షపతి పాల్గొన్నారు.