05-05-2025 01:12:34 AM
సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అశ్వారావుపేట మే 4 (విజయక్రాంతి): నియోజక కేంద్రమైన అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగాయి అని ఆసుపత్రి సూపర్డెంటెండ్ డాక్టర్ రాధరుక్మిణి తెలిపారు. గతంలో నెలకి పది ప్రసవాలు జరిగేవని, ప్రస్తుతం ప్రసవాలు ఇరవై మూడు కి చేరినట్టు ఆమె తెలిపారు. పదహారు సుఖ ప్రసవాలు జరగగా, కేవలం ఏడుగురు మ హిళలకు మాత్రమే ఆపరేషన్స్ చేయటం జరిగింది అని డాక్టర్ తెలిపారు.
గతంలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ సందర్భాలలో వైద్యుల కొరత పై ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు సూచించగా, జిల్లా కలెక్టర్ అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించి నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబుని ఆదేశించారు. ప్రోత్సాహకాలతో కూడిన వేతనాలపై ఆకర్షితులైన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించటం జరిగిందన్నారు.
ప్రస్తుతం అశ్వరావుపేట ఆసుపత్రిలో ఇద్దరు ప్రసూతి వైద్యులు, ఇద్దరు మత్తు వైద్యులు, ఒక పిల్లల వైద్యులు, 4 ఎంబిబిఎస్ వైద్యులు ఉన్నారు. స్థానికంగానే ప్రసూతి వైద్యులు, పిల్లల వైద్యులు, మత్తు డాక్టర్లు అం దుబాటులో ఉండటం, రోగులకు మంచి చికిత్స అందుతుండటంతో ప్రజలు సర్కారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారని ఆమె తెలిపారు.
స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సహ కారం, అధికారుల సమన్వయం, జిల్లా కలెక్టర్ సహకారంతో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ల్యాబ్ టెస్టులు, అందుబాటులో ఉంటున్నాయని వైద్యులు తెలిపారు.
ప్రసవానికి సంబంధించిన మందులు ప్రసూతి వార్డుల్లో ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. డ్బు శాతం నార్మల్ డెలివరీ అవ్వడం పట్ల రాష్ట్ర టీవీవిపి కమిషనర్ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆది నారాయణ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు హర్షం వ్యక్తం చేశారు.