calender_icon.png 5 May, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్‌డౌన్‌కు సిద్ధం!

05-05-2025 01:12:32 AM

సమస్యలు పరిష్కరించకుంటే పోరు తప్పదు

  1. మే 15నుంచి జూన్ 9వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రకటన
  2. నల్లబ్యాడ్జీలతో నిరసన, సామూహిక సెలవులు, మానవహారాలు..
  3. జూన్ 9న లక్ష మందితో మహాధర్నా
  4. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం జారీ
  5. ఏడు నెలల నుంచి క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం కాలేదు: జేఏసీ
  6. ప్రభుత్వ తీరుతో 13 లక్షల 31 వేల కుటుంబాలు సంక్షోభంలోకి
  7. ప్రభుత్వ తీరును నిలదీస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెన్‌డౌన్‌కు సిద్ధమవుతున్నారు. ఈమేరకు మే 15 నుంచి జూన్ 9 వరకు ప్రత్యేక కార్యాచరణ ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రకటించిం ది. ఈలోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే భోజన విరామ సమయాల్లో నల్లబ్యా డ్జీలతో నిరసన ప్రదర్శనలు, పనివేళల్లో  మాత్రమే పనిచేయటం, ప్రభుత్వ కార్యాలయాల ముందు మానవ హారాలు, సామూహిక భోజనాలు, సామూహిక సెలవులు పెడతామని అల్టిమేటం జారీ చేశారు.

ఆతర్వాత జూన్ 9న లక్ష మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లతో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.10వేల కోట్ల పెండింగ్ బిల్లులు, 5 పెండింగ్ డీఏల విడుదలతోపాటు ప్రధానమైన మరికొన్ని డిమాండ్లను వెంటనే పరి ష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగా ణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, అలసత్వంతో 13 లక్షల 31 వేల ఉద్యో గుల కుటుంబాలు సంక్షోభంలో నెట్టివేస్తున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్య విధానాలతో నూతన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, ఈ ప్రభుత్వంలోనైనా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సంబురపడ్డామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలవుతున్నా మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో  ప్రభుత్వ చిత్తశుద్ధి కనబడటంలేదన్నారు.

క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పడి 7 నెలలు అయ్యిందని, కానీ ఒక్కసారి కూడా సమావే శం జరపలేదని పేర్కొన్నారు. ‘ప్రజా పాలన అంటారు.. ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రజ ల్లో భాగస్వామ్యులు కాదా?..’ అని నిలదీశారు. ఉద్యోగులు ఓపికతో ఉన్నారని, దాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరించారు. జూన్9న లక్ష మందితో మహాధర్నాను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. 

అప్పుడొకమాట, ఇప్పుడొక మాటనా?: జేఏసీ నాయకులు

ప్రజాపాలనలో ప్రజలే కాదు, ఉద్యోగు లూ భాగస్వామ్యులేనని టీజేఏసీ అడిషనల్ సెక్రట రీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నా యి కానీ, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు రావడంలేదన్నారు. ఐక్యంగా ఉండి, హక్కులు సాధించుకుందామని జేఏసీ కోచైర్మన్ చావ రవి చెప్పారు.

ప్రతి పక్షంలో ఉన్న ప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరోమాటనా అని ప్రభుత్వాన్ని కోచైర్మన్ సదానందం గౌడ్ ప్రశ్నించారు. ‘ఖజానాకు జ్వరం వచ్చింది పత్యం చేయాలని సీఎం అం టారు.. ఉద్యోగులే పత్యం చేయాలా..?’ అని టీజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏ సత్యనారాయణ నిలదీశారు. తెలంగాణ ఉద్యోగులంటే అడ్డమీద కూలీలం కాదని టీజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ముజీబ్ హుస్సేన్ పేర్కొన్నా రు.

సదస్సులో ఏకగ్రీవంగా 9 తీర్మానాల ను ఆమోదించారు. కోచైర్మన్లు మధుసూదన్‌రెడ్డి, వీ రవీందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్లు అంజిరెడ్డి, ఎం చంద్రశేఖర్‌గౌడ్, ఏ సత్యనారాయణరెడ్డి, హనుమంతరావు, సర్వతీ సత్యనా రాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ, ప్రచార కార్యదర్శి బీ శ్యామ్, కార్యదర్శి మహ్మద్ అబ్దుల్లా, కార్యదర్శి కనకచంద్రంతోపాటు టీజేఏసీ నాయకులు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

సీఎం ఇచ్చిన హామీకి అతీగతీలేదు..

దేశంలోని ఏరాష్ట్రమూ 5 డీఏలను పెండింగ్‌లో పెట్టలేదని, ఉద్యోగులు పొదుపు చేసిన డబ్బులను అవసరమైనప్పుడు ఇవ్వకపోవడం అమానవీయమ ని, పిల్లల విద్యా, వివాహ, ఇంకా వైద్య, గృహావసరాలకు డబ్బులు అందక తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

గతేడాది అక్టోబర్ 24న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగులతో జరిపిన సమావేశంలో 15 రోజుల్లోగా పెండిం గ్ బిల్లులు క్లియర్ చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని వారు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతీనెల రూ.650 కోట్లు కేటాయించి, 16 నెలల్లోగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని, కానీ గత ఏప్రిల్ నెలలో రూ.650 కోట్లు కాదు కదా రూ.5కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు.

వేతన సవరణ కోసం ఏర్పాటు చేసిన శివశంకర్ కమిటీ గడువు పూర్తయి ఏడాదిన్నర అవుతున్నదని, ఆ నివేదికను ఇంతవరకూ ప్రభుత్వం తెప్పించుకోలేదన్నారు. వెంటనే ఆ నివేదికను తెప్పించు కొని కరువు భత్యాలను కలుపుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఆరోగ్య పథకం అమలుచేయా లని, ఏప్రిల్, మే నెలలో సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలన్నారు.