05-05-2025 02:10:55 AM
న్యూఢిల్లీ, మే 4: ఒక వేళ భారత్‌తో గను క పాక్ యుద్ధం చేయాల్సిన పరిస్థితే వస్తే ఆ దేశం వద్ద ఉన్న మందుగుండు సామగ్రి కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపోతుందని పలు కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద అతితక్కువ స్థాయి లో మందుగుండు సామగ్రి నిల్వలున్నాయి. పాకిస్థాన్ తన వద్ద ఉన్న యుద్ధ రిజర్వులను చాలా వరకు ఉక్రెయిన్‌కు విక్రయించింది.
దీంతో పాకిస్థాన్‌లో ఆయుధ సామగ్రికి కొరత ఏర్పడింది. నిల్వలను పెంచేందుకు పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తీవ్రంగా శ్రమిస్తున్నా కానీ ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికే అనేక మంది పాక్ నేతలు భారత్ మిలటరీ చర్యకు సిద్ధమైందని వ్యాఖ్యానిస్తున్నారు. తమ భద్రతా దళాలు భారత ఆర్మీకి తగిన రీతిలో సమాధానం ఇస్తాయని వారు బయటికి చెబుతున్నారు కానీ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు.
పాక్‌కు చుక్కలే..
ఒకవేళ భారత్ యుద్ధాన్ని ప్రారంభిస్తే పాకిస్థాన్‌కు క్లిష్ట పరిస్థితులు తప్పేలా లేవు. ఏ దేశమైనా యుద్ధంలో గెలవాలంటే ఫిరంగులు తప్పనిసరి. కానీ ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద వీటికి అవసరం అయిన మందుగుండ్లు లేవు. దీంతో పాక్‌కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఇటీవలే పాకిస్థాన్ తన వద్ద ఉన్న ఆయుధ నిల్వలను ఉక్రెయిన్‌కు విక్రయించింది. ఇటీవలే జరిగిన పాకిస్థాన్ కోర్ కమాండర్ల సమావేశంలో కూడా యుద్ధ సామగ్రి కొరత గురించిన ఆంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఒక వేళ యుద్ధం వస్తే వాడుకునేందుకు వీలుగా పాకిస్థాన్ తన మందుగుండు నిల్వల కేంద్రాలను భారత సరిహద్దుల్లోనే ఏర్పాటు చేస్తోంది.
ఇదే సమయంలో భారత్ మందుగుండు సామగ్రి ఉత్పత్తిని భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేసినట్టు ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది.
టర్కీ గస్తీ నౌకను తెచ్చుకున్న పాక్
భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని వణికిపోతున్న పాకిస్థాన్ టర్కీకి చెందిన టీజీసీ బుయుకడా అనే భారీ యుద్ధనౌకను కరాచీ తీరంలో మోహరింపజేసింది. టర్కీకి చెందిన ఈ యుద్ధనౌక జలాంతర్గాములకు వ్యతిరేకంగా పని చేస్తూ.. ప్రభావవంతంగా గస్తీ కాస్తుంది. భారత్ ఓ పక్క వరుస భేటీలు నిర్వహిస్తోంది.