calender_icon.png 15 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2025 03:08:34 PM

నకిరేకల్, (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day celebrations) వేడుకలను శుక్రవారం ఘనంగానిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఉద్దీపన పాఠశాల, మున్సిపల్ , తహసిల్దార్, మండల పరిషత్ కార్యాలయం , ఐసిడిఎస్, అగ్నిమాపక, వ్యవసాయ కార్యాలయం, పోలీస్ స్టేషన్,అన్ని ప్రభుత్వ కార్యాలయంలో విద్యాసంస్థలో, కార్పెంటర్ యూనియన్, స్వర్ణకారుల సంఘం, ఎలక్ట్రికల్, లారీ అసోసియేషన్, వివిధ యూనియన్ ఆఫీసుల వద్ద జాతీయజెండానుఆవిష్కరించారు. అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకోని వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేములవీరేశంమాట్లాడుతూ.ఎంతోమంది అమరవీరల త్యాగపలేమే నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుజరుపుకుంటున్నామన్నారు.

వారుచేసినత్యాగంచిరస్మరణీయమన్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ పి యాదగిరి ఎంపీడీవో వై వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ రంజిత్ , ఐసిడిఎస్ సిడిపిఓ ఆస్రాఅంజుమ్, పట్టణ సీఐ వెంకటేశ్వర్ గౌడ్ , అగ్రికల్చర్ ఏవో జానిమియా అధికారులు, స్థానిక కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు. కట్టంగూర్ లో కట్టంగూర్ మండల కేంద్రంలో తహసిల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్ వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థల్లో, 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ పి యాదగిరి ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు, ఎస్సై రవీందర్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.