15-08-2025 03:10:42 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల తోపాటు జిల్లాలోని ఖానాపూర్ మండలం(Khanapur Mandal) మస్కాపూర్ జడ్పీహెచ్ఎస్ కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మెరిట్ ప్రతిభా పురస్కారాలు శుక్రవారం అందుకున్నారు. పదవ తరగతి ఇంటర్లో జిల్లా స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన ఈ పాఠశాల విద్యార్థులకు పదివేల నగదు ప్రశంస పత్రాన్ని రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డానియల్ ఆదర్శ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అధికారులు ఉన్నారు