12-08-2025 12:00:00 AM
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలసాని తిరుపతిరావు
చిట్యాల, ఆగస్టు 11(విజయ క్రాంతి):79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలసాని తిరుపతిరావు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో కలిగివుండి,ధర్మం వైపు పయనించాలని సూచించారు.భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని స్వతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగం చేసి మనకు స్వాతంత్రం కలుగజేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు సోదరా,సోదరి భావంతో కలిగివుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు, బుర్ర వెంకటేష్ గౌడ్, మైదం శ్రీకాంత్, తీగల జగ్గయ్య, సుదగాని శ్రీనివాస్ , గుండ సురేష్ ,మందల మొగిలి, గజనాల రవీందర్, చింతల రాజేందర్, మార్తా అశోక్, కదం రాజు, తీగల వంశీ ,నీలి సుధాకర్ రెడ్డి, సాదా సాదానందం, బుర్ర ఆభిజ్ఞ,బుర్ర వితేష్, గోల్కొండ అజయ్ పాల్గొన్నారు.