calender_icon.png 12 August, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్రహం అడుగులు ఎటువైపు?

12-08-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్‌లో చేరిన క్రియాశీల రాజకీయాలకు దూరంగా 
  2. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నం
  3. కమలం వైపు అంటున్న సన్నిహిత వర్గాలు

గద్వాల, ఆగస్టు 11 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న అలంపూర్ నియోజకవర్గం ఎప్పుడు రాజకీయ మ లుపులో ప్రత్యేకతను చాటుకుంటూనే వ స్తుంది. మాజీ ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన అ నుచర వర్గం మాత్రం బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో తన వశం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళుతు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పొత్తులో భాగంగా అధికారంలోకి రాగా తెలంగాణ రాజకీయా ల వైపు పాగా వేయాలని అడుగులు వే స్తుంది.

ఈ నేపద్యంలో టిఆర్‌ఎస్ పార్టీలో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన వారితోపాటు కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి నా యకులను ఆకర్షించేందుకు పావులను కదుపుతుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు ఇప్పటికే బి ఆర్‌ఎస్ పా ర్టీని వీ డి బిజెపి పార్టీలోకి చేరగా గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది తన ప్రజా బలాన్ని ఆకర్షించే నేతగా అబ్రహం ఏదిగారు.

కాగా గత ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ నుండి టికెట్ ని ఆశించి తీవ్రంగా శ్రమించిన ఆయనకు విజేయుడు రూపంలో అదృష్టం చేజారింది. నువ్వా నేనా అంటూ ఉద్రిక్త భరితంగా చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీస్సు లు కోల్పోయి టికెట్టు దగ్గకపోవడంతో ఆ యన భంగపడ్డారు. దీంతో వెంటనే తనని కాదని పార్టీ టికెట్ ఇచ్చిన విజేయుడు ను ఓ డించేందుకు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎ మ్మెల్యే సంపత్ కుమార్ గెలుపు కోసం చే తులు కలిపి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప మెజా ర్టీతో ఓడిన సంపత్ కుమార్ వద్ద క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. క్రమంగా పార్టీ కార్యక్రమాలు సభలు సమావేశంలో హాజరు కావడం లేద ని ప్రచారం లో ఉంది. తన రాజకీయ జీవితంలో తన వారసుడు మమకమై తన వెను క ఉండి చూసుకున్న తన కొడుకును తన రా జకీయ వారసుడిగా ప్రజలకు పరిచయం చే యాలనుకున్న తరుణంలో బి ఆర్ ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో తన కొడుకు రాజకీయ జీవితం ఎలాగైనా చక్క పెట్టాలన్న ఆలోచనతో బిజెపిలోకి అడుగులు పెట్టేందు కు యోచిస్తున్నట్లు తన సన్నిత వర్గాల ద్వా రా తెలిసింది.

ఇప్పటికే బిజెపి ముఖ్య నాయకులతో సంప్రదింపులు జరిగినట్లు ప్రచార సైతం జోరుగా వినిపిస్తోంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిజెపిలోకి అడుగుపెట్టిన వెంటనే సాధ్య అసా ధ్యాలపై పరిస్థితులను అంచనా వేసి ముం దుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. పరోపక్క తను పార్టీ మారుతున్నట్లు లీకులు ఇచ్చిన వెంటనే తనను కాంగ్రెస్ పా ర్టీ బుజ్జగిస్తుందా అన్న ఆశతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాబోయే స్థానిక సం స్థల ఎన్నికల్లో తన కుమారుడికి క్రియాశీల పదవి ఇస్తారని ఆశతో ఉన్నట్టు ప్రచారం జోరుగా వినిపిస్తుంది. పేదల డాక్టర్ గా, వివాదరహితుడిగా ఉన్న డాక్టర్ అబ్రహం 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2018లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

స్థానిక సంస్థల ముందా? తరువాతనా అన్నది ప్రశ్నార్థకం...? 

నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అబ్రహం అనుచరులు, అభిమానులు రాజకీయంగా తగిన నిర్ణయం తీసుకోవాలని అబ్రహం పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు మండలాల నాయకులు మంతనాలు చేస్తుండ డంతో వేచి చూద్దాం అన్న ధోరణిలో మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నడిగడ్డకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి అబ్రహంను బీజేపీలోకి రావలసిందిగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల లోపు నిర్ణయం తీసుకోవాలని కొంతమంది సూచిస్తుంటే.. మరి కొంతమంది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నిర్ణయాలు తీసుకుంటే బా గుంటుంది అని మరి కొంతమంది మాజీ ఎమ్మెల్యేకు సూచిస్తున్నట్లు సమాచారం. మొత్తం పైన డాక్టర్ అబ్రహం భారతీయ జనతా పార్టీలోనే చేరే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గంలో జోరుగా ప్రచారంజరుగుతోంది.