భారత్ ఏ బౌలర్లు విఫలం
03-07-2026 12:00 AM
శ్రీలంక ఏ స్కోరు 288/5
గాలే, జూలై 2 : శ్రీలంక ఏ జట్టుతో జరుగు తున్న రెండో అనధికార టెస్టులో తొలి రోజు భా రత బౌలర్లు చేతులెత్తేశా రు. లంక బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫలితంగా మొదటిరోజు శ్రీలంకదే పైచేయిగా నిలిచింది.
తొలి టెస్టులో అదరగొట్టిన అకిబ్ నబీ సైతం నిరాశపరిచాడు. ఒక్క వికెట్ కూ డా తీయలేకపోయాడు. దీం తో మొదటిరోజు ఆటముగిసే సమయానికి శ్రీలంక ఏ జట్టు 5 వికెట్లకు 288 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో సహాన్ అరచ్చిగే 83 నాటౌ ట్, అంజల బండార 42 , ఫెర్నాం డో 44 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సారాన్ష్ జైన్ రెం డేసి వికెట్లు పడగొట్టారు.






