నూతన హెల్త్ స్కీమ్ అమలు చేయండి
సీఎస్‌కు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
హైదరాబాద్, జులై 2(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన హెల్త్ స్కీమ్‌ను వెంటనే అమ ల్లోకి తేవాలని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ను కోరారు. కొత్తగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు ను సచివాలయంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపా ల్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన హెల్త్ స్కీమ్ ప్రారంభించి రెండు మాసాలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల వేతనం నుంచి మినహాయింపులు జరిగినప్పటికీ హెల్త్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో ఉద్యో గులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఎస్ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చెందిన సీపీఎస్ ఉద్యోగుల మూలవేతనంపై నిర్ణయం, భార్యాభర్తలు ఇద్దరి వద్ద మినహాయించిన మొత్తాన్ని వెంటనే ఒకరికి తిరిగి చెల్లింపు జరపాలని కోరారు.
ఈ స్కీమ్ లో అన్ని యాజమాన్యాల, గురుకుల ఉపాధ్యాయులతోపాటు మోడల్ స్కూల్ ఉపా ధ్యాయులను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశా రు. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి వెంటనే స్కీమ్ ను అమలుపర్చాలని కోరారు. అంతేకాకుం డా ఈ స్కీమ్‌ను ప్రైవేటు యాజమాన్యాల్లో ని ఉద్యోగ, అధ్యాపకులకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయా లపై సీఎన్ సానుకూలంగా స్పందించిన ట్లు ఎమ్మెల్సీ తెలిపారు. సీఎస్‌ను కలిసిన వా రిలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.






