30-01-2026 09:04:11 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలక్షన్ నిర్వహణ పర్యవేక్షనాధికారిగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కసమల వ్యవహరించగా ఎన్నికల అధికారిగా ఎస్.ప్రదీప్ కుమార్ వ్యవహరించారు. సహాయకులుగా స్థానిక ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎన్.శ్రీనివాస్ జూనియర్ న్యాయవాది షారూక్ రూమాన్ వ్యవహరించారు.
ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిపించుటలో స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రాథమిక చికిత్స వైద్య సహాయం కొరకు కు స్థానిక డాక్టర్ సురేష్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణాధికారి స్థానిక జడ్జి సాయికిరణ్ కసమల పర్యవేక్షించారు. ఎన్నికలు శాంతి భద్రతలతో సకల సౌకర్యాలతో నిర్వహించబడినట్లు ఎన్నికల అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు.