10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కీలక భాగస్వామి భారత్

27-07-2025 12:11 AM
  1. మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు
  2. ద్వీపదేశంలో ఘనంగా 60వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
  3. ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారత ప్రధాని మోదీ
  4. తిరుగుపయనమైన మోదీ

న్యూఢిల్లీ, జూలై 26: భారత్ తమకు అ త్యంత కీలక భాగస్వామి అని మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు పేర్కొన్నారు. శనివారం ద్వీపదేశం మాల్దీవుల 60వ స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. భారత ప్రధానితో ప్రత్యేకంగా సమావే శం అయిన తర్వాత మయిజ్జు భారత్‌ను, ప్ర ధాని మోదీని కొనియాడారు. ‘సుదీర్ఘకాలం గా మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహిత, కీలక భాగస్వామిగా ఉంటోంది.

భద్రత, వా ణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి అనేక రంగాల్లో ఇరు దేశాల నడుమ పరస్పర సహకారం కొనసాగుతోంది. ఎలాంటి విపత్తులు, సంక్షోభాలు ఎదురైనా భారత్ మా దేశానికి అండగా నిలిచి ఆపన్నహస్తం అందించింది’ అని అన్నారు. ప్రధాని మోదీతో ప్రత్యేక విం దు అనంతరం మోదీ నాయకత్వాన్ని కొనియాడారు.

4,078 రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగడం గొప్ప మైలురాయి అని, ప్రజాసేవ, దేశప్రజల పురోగతి, శ్రేయస్సుపై మోదీ అంకితభావం గొప్పదన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ మాల్దీవుల ఉపాధ్యక్షుడు లతీఫ్‌తో భేటీ అయ్యారు. మా ల్దీవుల పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని తూతుక్కుడికి బయల్దేరారు. 

వికసిత్ తమిళనాడు నిర్మిద్దాం

తూతుక్కుడి: తమిళనాడులోని తూతుక్కుడిలో శనివారం ప్రధాని మోదీ రూ. 4,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ‘ప్రపంచదేశాలకు భా రత్‌పై పెరుగుతున్న విశ్వాసానికి ఇది ప్రతీక. ఇదే ఆత్మవిశ్వాసంతో మనం వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడును నిర్మిద్దాం’ అని పేర్కొన్నారు. తూతుక్కుడిలో కొత్త వి మానాశ్రయ టెర్మినల్ భవనానికి, పలు రైల్వే ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులు మొదలైన వాటికి శంకుస్థాప చేశారు.