calender_icon.png 27 July, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన్నుకున్న సిద్ధరామయ్య, శివకుమార్ ప్రతినిధులు

27-07-2025 12:08:42 AM

  1. అధికార మార్పిడిపై ఘర్షణ వాతావరణం
  2. ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ

న్యూఢిల్లీ, జూలై 26: కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తా జాగా ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో సీఎం, డి ప్యూటీ సీఎంల ప్రత్యేక అధికారులు పరస్పరం దాడి చేసుకోవడం సంచలనం కలిగిం చింది. పార్టీ వర్గాల ప్రకారం.. సిద్ధరామయ్య వద్ద ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తు న్న మోహన్‌కుమార్ అనే అధికారి తనను షూతో కొట్టినట్లు శివకుమార్ వద్ద పనిచేసే ప్రత్యేక అధికారి ఆంజనేయ ఆరోపించారు.

షూతో కొట్టి పార్టీ నేతల ముందు తన గౌరవానికి భంగం కలిగించినందువల్ల అతడిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా మోహన్‌కుమార్ పలువురు ఉన్నతాధికారులతో దు రుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ విష యం తమ దృష్టికి వచ్చిందని రెసిడెంట్ కమిషనర్ ఇమ్‌కోంగ్ల జమీర్ తెలిపారు. ఆంజనే య తనతో దురుసుగా ప్రవర్తించినట్టు సీ ఎం ప్రత్యేక అధికారి మోహన్‌కుమార్ ఆరోపించారు.

ఆయనే తన ఛాంబర్‌లోకి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కార్యాలయంలోని ఔట్ సో ర్సింగ్ సిబ్బంది తొలగించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామం కర్ణాటకలో రాజకీయ దు మారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలిక మొదలైందని విమర్శించారు.

కర్ణాటక ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకత్వం నియంత్రణ కోల్పోయిందని ప్రతిపక్ష నేత ఆర్.అ శోక్ తెలిపారు. రెండు వర్గాలు బహిరంగంగానే కొట్టుకుంటున్నారనిపేర్కొన్నారు. అధి కారులు కొట్టుకుంటే ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని ధ్వజమెత్తారు.